బస్సులు నడిపిస్తాం..!
– బీఆర్ఎస్వీ నేతలతో డీపో మేనేజర్ హామి
– విద్యార్థుల సమస్యలపై స్పందించిన బీఆర్ఎస్వీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా బస్సులు నడిపిస్తామని తాండూరు డీపో మేనేజర్ హామి ఇచ్చినట్లు పట్టణ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి తెలిపారు. తాండూరు మండలంలోని చెంగోల్, చింతామణి పట్నం, పర్వతాపూర్ తదితర గ్రామాలకు బస్సులు రాక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నట్లు బీఆర్‌ఎస్వీ నేతల దృష్టికి వెళ్లింది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. దీంతో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్ సమతను కలిశారు. బస్సులు ఎందుకు నడపడం లేదని అడిగి తెలుసుకున్నారు. వివిధ మార్గాల్లో బస్సులు సర్వీసుకు వెళ్లడంతో ఇబ్బందులు తలెత్తాయని డీపో మేనేజర్ తెలిపినట్లు సందీప్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల కోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బస్సు పాసు ఫీజులు చెల్లించారని గుర్తుచేశారు. విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయంగా బస్సులను పాఠశాల, కళాశాలల సమయానికి అనుకూలంగా నడిపంచాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు డీపో మేనేజర్ సమత స్పందించి విద్యార్థుల కోసం బస్సులు నడిపిస్తామని హామి ఇచ్చినట్లు సందీప్ రెడ్డి తెలిపారు. దీంతో విద్యార్థుల సమస్య తెలిసిన వెంటనే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని సందీప్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్వీ ప్రధాన కార్యదర్శి నాసిర్, యువనాయకులు రజక నర్సింహా తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..

