ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని సన్మానించిన టీఆర్ఎస్ యువనాయకులు
– జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉమ్మగి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, రవాణా శాఖ మాజీ మంత్రి మహేందర్‌రెడ్డిని తాండూరు టీఆర్ఎస్ యువనాయకులు ఘనంగా సన్మానించారు. గురువారం ఎమ్మెల్సీ జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ యూత్ రాష్ట్ర కార్యదర్శి బిర్కడ్ రఘు ఆధ్వర్యంలో మహేందర్‌రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని శాలువా, పూలమాలతో సత్కరించి కత్తిని బహుకరించారు. అనంతరం బిర్కడ్ రఘు మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రి పదవిని పొందాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో యువనాయకులు శివానంద్, సోము తదితరులు ఉన్నారు.

