కాస్ట్‌లీ కారులో కామన్ మెన్..!

జాతీయం తెలంగాణ హైదరాబాద్

కాస్ట్‌లీ కారులో కామన్ మెన్..!
– పేదోడి కోరికను తీర్చిన అమీర్‌ శర్మ
– హృదయాలను తాకిన వీడియో
– సోషల్ మీడియాలో వైరల్ అయిన సంఘటన
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఈ ప్రపంచంలో ఉన్న ధనవంతులు అనుభవిస్తున్న వసతులు, సౌకర్యాలు అనుభవించాలని ప్రతి పేదోడు అనుకుంటాడు. ఒక్కసారైనా వారిలాగే ఖరీదైన కార్లలో, భవనాలతో, వ్యాపారాలలో ఒకక్షణం ఉండిపోవాలని కలలు కనడం సహజం. అలాంటి వారి కలలను తీర్చడంలో ధనవంతులు అరుదుగా ఉంటారు. పేదవాని కలను, ఆశను గుర్తించి వాటిని నెరవేర్చిన ఆనందాన్ని ఇద్దరు పంచుకుంటారు. అలాంటి సందర్భాలు హృదయాలను హత్తుకుంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరిగిన ఇలాంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతలా అంటే ఇన్ట్సాగ్రామ్‌లో రికార్డు స్థాయి వ్యూస్, లైక్, షేర్లను సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందిన అమీర్ శర్మ ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్‌గా కొనసాగుతున్నారు. ఇతనికి కాస్ట్‌లీ కార్లు అంటే పిచ్చి. కొత్త మోడల్‌లో వచ్చిన కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఇతని వద్ద ఖరీదైన స్పోర్ట్ కారు ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ చోట కారు నిలుపుకుని ఉండగా అక్కడికి వచ్చిన ఓ పేద వ్యక్తి స్పోర్ట్ కారు వద్ద సెల్పీలు తీసుకుంటు ఉంటాడు. అంతలోనే అక్కడికి వచ్చిన అమీర్ శర్మ అతన్ని గమనిస్తాడు.

పేద వ్యక్తి వెళుతుండగా అమీర్ శర్మ అతన్ని పలకరిస్తాడు. అతని వద్ద ఉన్న సెల్‌ ఫోన్ తీసుకుని స్వెచ్ఛగా ఫోటో దిగు అని చెబుతాడు. స్వయంగా కారులో కూర్చోబెట్టి ఫోటోలు తీస్తాడు. ఈ వీడియోలో పేదోడిని ఆశను తీర్చిన దృశ్యాలు అందరి హృదయాలను హత్తుకుంటాయి. ఇన్ట్సాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో తెగ వైరల్ అయ్యింది.

ఇది కూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు