బీజేపీలో చేరిన గిరిజనులు
– ఆహ్వానించిన జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, ఉపాధ్యక్షులు రాఘవన్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం అంతారం తాండాలో పలువురు గిరిజనులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆదివారం తాండాలో గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్ ఆద్వర్యంలో యలాల, బషీరాబాద్ మండల గిరిజన మోర్చ అధ్యక్షుల ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, ఉపాధ్యక్షులు కె.రాఘవన్ నాయక్‌లు ముఖ్య అథితులుగా హాజరయ్యారు. వారి సమక్షంలో గిరిజన మోర్చ యలాల మండల అధ్యక్షులుగా మోహన్ నాయక్, బషీరాబాద్ మండల అధ్యక్షులుగా కిషన్ పవార్‌లకు నియామక పత్రాన్ని అందించారు. అంతకుముందు తాండాకు చెందిన దాదాపు 80 మంది గిరిజనులు బీజేపీలో చేరారు. వారికి యు.రమేష్ కుమార్, కె.రాఘవన్ నాయక్‌లు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, కార్యవర్గ సభ్యులు రామ్య నాయక్, బీజేపీ సీనియర్ నాయకులు పూజారి పాండు, మున్సిపల్ కౌన్సిలర్ బాలాప్ప, గిరిజన మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి రాంజీ రాథోడ్, అధికార ప్రతినిధి భాను పవార్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

