అట్టహాసంగా మార్కెట్ కమిటి ప్రమాణ స్వీకారం
– మంత్రి హరీష్ రావు సమక్షంలో కొలువు దీరిన పాలకవర్గం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి పాలకవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. బుధవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి || ఆధ్వర్యంలో పట్టణంలోని విలియమూన్ గ్రౌండ్ లో ప్రగతి ప్రస్థాన సభ జరిగింది.
ఈ సభకు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారి సమక్షంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వీణా శ్రీనివాస్ చారీ, వైస్ చైర్మన్ గా చంద్రవంచ పటేల్ ఉమాశంకర్, డైరెక్టర్లుగా హరిహరగౌడ్, షేక్ ఖాశిం అలీ, మాతరి ప్రకాశం, కుర్వ భీమప్ప, యు. గోపాల్ రెడ్డి, ఎండీ ముస్తఫా, గోవింద్ నాయక్, అప్పుల వెంకటప్పు, మంత్రి వెంకటయ్య, జట్టిగాళ్ల శ్రీనివాస్, భాను ప్రసాద్, ప్రశాంత్ గౌడ్ లు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మార్కెట్ కమిటి కొత్త పాలకవర్గం కొలువు దీరింది.
ఇది కూడా చదవండి…

