రేపు తాండూరులో మంత్రి, ఎమ్మల్యే పర్యటన

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు తాండూరులో మంత్రి, ఎమ్మల్యే పర్యటన
– పెండింగ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరు నియోజకవర్గంలో సమాచార, గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు పర్యటించనున్నారు. ఇటీవల అనివార్య కారణాల వల్ల రద్దు అయిన పెండింగ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ఇందులో భాగంగా సోమవారం రూ. 54 కోట్ల నిధులకు సంబంధించి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పెద్దేముల్ మండలంలో బుద్దారం బ్రిడ్జి, గాజీపూర్ బ్రిడ్జిలకు ప్రారంభోత్సవం, తాండూరు మండలంలో బొంకూరు బ్రిడ్జికి, భాంజాపూర్ లో చెక్ డ్యాంకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ఎల్మకన్నెలో ఆరోగ్య కేంద్రం, మీసేవా కేంద్రాల ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

తాండూరు పట్టణంలో మున్సిపల్లో గ్రీనరీకి శంకుస్థాపన, డ్వాక్రా, అంగన్ వాడి భవనాల ప్రారంభోత్సవం, పాత కుంటలో కేసీఆర్ థీమ్ పార్కుకు శంకుస్థాపన, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. యాలాల మండలంలో బెన్నూర్ చెక్ డ్యాం, చెన్నారం రోడ్డుకు శంకుస్థాపన, బషీరాబాద్ మండలంలోని గొట్టిగ కలాన్ లో రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడ చదవండి..

14 మంది మట్కారాయూళ్లపై కేసు