శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తిరుమల తిరుపతిలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి తిరుమల శ్రీ వారి దర్శనం చేసుకున్నారు. తాండూరు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అభివృద్ధి మెండుగా జరగాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు.
