పైలెట్ వస్తున్నాడు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్ వస్తున్నాడు..!
– రేపటి నుంచి పట్టణంలో ఎమ్మెల్యే పాదయాత్ర
– మూడు రోజుల పాటు వార్డుల్లో పర్యటన
– విజయవంతానికి పిలుపునిచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పక్కా ప్రణాళికతో సిద్దమయ్యారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి తాండూరు పట్టణంలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీ నేతలు, కార్యకర్తలతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. పట్టణంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. రేపు ఉదయం 8 గంటలకు పట్టణంలోని 14 వార్డు నుంచి 23వ వార్డు, 26 నుంచి 31వ వార్డు వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు.

పాత తాండూరులోని కోటేశ్వర దేవాలయం, నిజాం షాహీ దర్గాలలో పూజలు, ప్రార్థనలు చేసి పాదయాత్ర మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పాదయాత్రలో గులాబీ నేతలు, కార్యకర్తలు జెండాలతో పాల్గొనాలని సూచించారు. పాదయాత్ర విజయవంతానికి అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, మున్సిల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీణ హేమంత్ కుమార్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ, పట్టణ అధ్యక్షురాలు సంగీత ఠాకూర్,కౌన్సిలర్లు అస్లాం, భీంసింగ్, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత