– అధికారులకు గాంధీనగర్ వాసుల ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో చేపడుతున్న సెల్ టవర్ నిర్మాణాన్ని తొలగించాలని కాలనీ వాసులు కోరారు. బుధవారం టీఆర్ఎస్‌వై రాష్ట్ర నాయకులు బిర్కట్ రఘు ఆధ్వర్యంలో కాలనీ వాసులు
మున్సిపల్ అధికారులకు ఫిర్యాదును అందజేశారు. కాలనీలోని ఇంటినెంబర్ 6-8-60/2బి పైన సెల్ ఫోన్ టవర్ నిర్మిస్తున్నారని తెలిపారు. అయితే దీని వల్ల, వార్డ్ లోని గర్భిణి మహిళలకు, చిన్న పిల్లలకు, పెద్ద వాళ్ళకు రేడియేషన్ సమస్య తలెత్తుతుందని అన్నారు. ముందే కరనా మూడో దశ ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కావున దీనిని దృష్టిలో సెల్ ఫోన్ టవర్ ని తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు శ్రీశైలం, టిఆరేస్వి దత్తాత్రేయ, జగదీష్ , సిద్దు, తదితరులు పాల్గొన్నారు.
