బీజేపీ బలోపేతానికి కృషి చేయండి
– బీజేపీ రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్
– మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా అధ్యక్షుడు యు. రమేశ్‌కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ ఆ పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడు యు. రమేశ్‌కుమార్ కు సూచించారు.

మంగళవారం హైదరాబాద్‌లో బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్ నాయకుడు డా. కె. లక్ష్మణ్‌ను రమేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడిగా తనకు బాధ్యతలు అప్పగించినందుకు లక్ష్మణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డా. కే. లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. అదేవిధంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నాయకులు, కార్యకర్తల సమన్వయంతో వికారాబాద్ జిల్లాలో బీజేపీని మరింత బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతామని అన్నారు.

పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామస్థాయి నుంచి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ ముదిరాజ్, బంటారం భద్రశ్వర్, రమేష్ సాగర్, రాము నవీన్‌గౌడ్ తదితరులు ఉన్నారు.


