త‌ల్ల‌డిల్లిన త‌ల్లి..!

ఆరోగ్యం తాండూరు రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

త‌ల్ల‌డిల్లిన త‌ల్లి..!
– కూతురును నిలోఫ‌ర్ తీసుకెళ్లేందుకు క‌ష్టాలు
– అంబులెన్స్‌ను వేడుకున్నా మాతృమూర్తి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చేప‌ట్టిన భార‌త్ బంద్ వ‌ల్ల ఓ త‌ల్లి బాధ‌ప‌డింది. అనారోగ్యానికి గురైన తన కూతురును హైద‌రాబాద్‌లోని నిలోఫ‌ర్‌కు తీసుకెళ్ల‌లేక త‌ల్ల‌డిల్లిపోయింది. చివ‌ర‌కు త‌మ‌ను హైద‌రాబాద్‌ను తీసుకెళ్లాల‌ని అంబులెన్‌ను వేడుకుంది. ఈ సంఘ‌ట‌న తాండూరు ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. ధారూర్ మండ‌లం నాగారంకు చెందిన మాధ‌వి చిన్న కూతురుకు జ్వ‌రం వ‌చ్చింది. చిన్నారిని హైద‌రాబాద్‌లోని నిలోఫ‌ర్‌కు తీసుకెళ్లాల‌న‌ని వైద్యులు సూచించారు. దీంతో సోమ‌వారం హైద‌రాబాద్ వెళ్లేందుక‌ని నాగారం నుంచి తాండూరుకు ఆర్టీసీ బ‌స్సులో చేరుకుంది. తీరా ఇక్క‌డికి వ‌చ్చాక భార‌త్ బంద్ పేరుతో ఆర్టీసీ బ‌స్సులు రొడ్డెక్క‌లేదు. దీంతో ఏమీ పాలుపోలేని స్థితితో మాధ‌వి రోడ్డుమీద‌కు వ‌చ్చింది. హైద‌రాబాద్ వెళ్లేందుకు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించింది. చివ‌ర‌కు హైద‌రాబాద్ వెళ్లేందుకు స‌హ‌క‌రించాల‌ని ప్ర‌భుత్వ అంబులెన్‌ను నిలిపి అడిగింది.
దాదాపు గంట పాటు త‌ల్లి కూతురు వైద్యం కోసం హైద‌రాబాద్ వెళ్లే ప్ర‌య‌త్నాలు చేసి త‌ల్లడిల్లిపోయింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ బ‌స్సులోనే తాండూరుకు వ‌చ్చినా.. భార‌త్ బంద్ ఉంద‌ని, బ‌స్సులు న‌డ‌వ‌వని డ్రైవ‌ర్లు కూడ చెప్ప‌లేక‌పోయార‌ని, హైద‌రాబాద్ వెళ్లేదారిలేక రోడ్డు మీదు ఎటు కాకుండా పోయాన‌ని ఆవేధ‌న వ్య‌క్తం చేసింది. కొద్ది సేప‌టి త‌రువాత స్థానికులు మాధ‌వి హైద‌రాబాద్ వెళ్లేందుకు స‌దుపాయం ఏర్పాటు చేసే స‌రికి ఆమె క‌నిపించ‌లేదు.
https://youtu.be/5xmuEepcIsU