కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి
– ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు అంకిత్ అనురాగ్
– బెంగలూరులో ఏఐసీసీ ఇంటర్వూలో ఎంపిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీని పటిష్ట పరచడానికి తన వంతు కృషి చేస్తానని ఎన్ఎస్యూఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు అంకిత్ అనురాగ్ అన్నారు.

కర్ణాటక రాష్ట్రం బెంగలూర్లోని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏఐసీసీ నాయకులు అల్ ఇండియా యువజన కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సభ్యుల ఇంటర్వూ నిర్వహించారు.

ఇందులో తెలంగాణ వికారాబాద్ జిల్లా నుండి తాండూరు నియోజకవర్గానికి చెందిన ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు అంకిత్ అనురాగ్ ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విద్ర్యార్థి నాయకుడి నుండి ప్రారంభించి ఈరోజు జాతీయ యువజన కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుల ఇంటర్వూలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. జాతీయ యువజన కాంగ్రెస్లో ఏ పదవి ఇచ్చిన క్రమశిక్షణతో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పని చేస్తానని అన్నారు.


