ఆర్టీసీకి సమ్మె సరైన్‌ సెగ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆర్టీసీకి సమ్మె సరైన్‌ సెగ..!
– తాండూరులో బస్సులన్నీ బంద్
– డీపోకే పరిమితమైన ప్రగతి చక్రాలు
– ప్రైవేటు వాహానాలను ఆశ్రయించిన ప్రయాణికులు
– గమ్య స్థానాలకు చేరేందుకు ఇబ్బందులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీలో మోగిన సమ్మె సరైన్ సెగ అంటుకుంది. సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరు విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టారు.

దీంతో తాండూరులో ఆర్టీసీ బస్సున్నీ డీపోకే పరిమితం అయ్యాయి. మంగళవారం ఆర్థరాత్రి నుంచి బస్సులు కదల్లేదు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు కూడా రోడ్డెక్కలేదు. అర్దరాత్రి నుంచే ఆర్టీసీ సమ్మె ప్రారంభం కావడంతో తాండూరు ఆర్టీసీలో రవాణా స్థంబించి పోయింది.

బస్సులు నడవకపోవడంతో ఉదయం నుంచే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ వద్దకు చేరుకుని వెనుదిరిగిపోయారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ఊర్లబాట పట్టారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు వాహనదారులు సొమ్ము చేసుకున్నారు. మరోవైపు బస్సులు డీపోకే పరిమితం కావడంతో పాటు ప్రయాణికులు లేకపోవడంతో ఆర్టీసీ బస్టాండ్ బోసిపోయింది. సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

పాత నేరస్తులపై పోలీసుల నిఘా