అర్థం చేసుకుంటే గణితం సులువే

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

అర్థం చేసుకుంటే గణితం సులువే
– నిరంతర సాధనతో అద్భుత ప్రతిభ సొతం
– గణిత శాస్త్ర నిపుణులు గౌరవ్‌ బండారి
– 24 నుంచి తాండూరులో తరగతులు
– సద్వినియోగంకు మార్వాడి యువమంచ్, రాజస్థాని మహిళ మండలి విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అర్థం చేసుకుంటే గణితం అందరికి సులువే అని ప్రముఖ గణిత శాస్త్ర నిఫుణులు గౌరవ్ బండారి అన్నారు.

తాండూరు మార్వాడి యువమంచ్, రాజస్థాని మహిళ మండలి సంయుక్థ ఆధ్వర్యంలో బుధవారం తాండూరు పట్టణంలోని గగ్రాని గార్డెన్‌లో హ్యూమన్ క్యాలిక్‌లేటర్(మానవ గణిత యంత్రం) ద్వారా విద్యార్థులకు గణితంలో మెళకువలు నేర్పే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీ మరాఠీ ఫేం, 6సార్లు గణితంలో రికార్డు సాధించిన గౌరవ్ బండారి హాజరై గణితం సులువుగా అర్థం చేసుకునే మెళకువలపై అవగాహన కల్పించారు.

అందరి జీవితంలో గణితం భాగమని ఉంటుందని అన్నారు. గణితాన్ని అర్థం చేసుకుంటే అద్బుతాలు సాధించడం సాధ్యమవుతుందని అన్నారు. మరోవైపు మార్వాడి యువమంచ్, రాజస్థాని మహిళ మండలి ఆధ్వర్యంలో ఈనెల 24, 25, 26 తేదీలలో తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలోని బాలాజీ మందిరంలో ఉదయం 8 నుండి 1 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. 4వ తరగతి నుండి డిగ్రీ విద్యార్థులు తరగతులకు హాజరు కావచ్చని తెలిపారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు కరణ్ జైన్ -9885222511, నిహార సోమాని -9701587650లకు సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా. రాజస్థానీ ప్రగతి సమాజ అధ్యక్షులు మురళీధర్ గాగ్రాణి, మంచ్ అధ్యక్షుడు కిషన్ రాఠి, కార్యదర్శి కరణ్ జైన్, కోశాధికారి భరత్ దేవ్డా, మహిళా మండలి అధ్యక్షురాలు కిరణ్ సార్డా, కార్యదర్శి వర్ష సార్డా, కోశాధికారి కల్పన రాఠి, సమాజ పెద్దలు, మహిళ మండలి సభ్యులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

మోడీపై వాఖ్యలు వెనక్కి తీసుకోవాలి