మోడీపై వాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
– మల్లికార్జున ఖర్గే చిత్రపటం దగ్దం
– తాండూరులో బీజేపీ నేతల నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ ప్రధాని నరేంద్రమోడిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చేసిన వాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తాండూరు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

బుధవారం బీజేపీ పట్టన అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చైరస్తా వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, కౌన్సిలర్లు, తదితరులు నిరసన వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్రమోడిని టెర్రసిస్ట్ అంటూ మల్లికార్జున ఖర్గే వాఖ్యలు చేయడాన్ని ఖండించారు. వ్యతిరేకంగా నినాదాలు చేసి.. మల్లికార్జున ఖర్గే చిత్రపటాన్ని దగ్దం చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్టుగా పోల్చడం సరికాదని, మల్లికార్జున ఖర్గే తన వాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీ పార్టీని విష సర్పాలుగా పోల్చడం పట్ల మల్లికార్జున్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఎస్పీ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, నాయకులు ఇందూర్ రాములు, పట్టణ ప్రధాన కార్యదర్శులు మంతటి రాజు, ప్రభాకర్ గౌడ్, ఉపాధ్యక్షులు చెదిరి ప్రకాష్, ప్రహ్లాద్ జాదవ్, బిచ్చప్ప, రామచందర్, కావాలి కృష్ణ, శివాజీ ఠాగూర్, బస్వరాజ్, వడ్డే సాయిలు, బబ్లూ, వీరన్న, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


