కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయండి

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయండి
– డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
– గ్రీన్ సిటీ కాలనీ నాయకులతో సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్ లో గ్రీన్ సిటీ కాలనీకి చెందిన నేతలు బుయ్యని మనోహర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం నేతలు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లి చైతన్య పరచాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమం, అభివృద్ధికి సమన్యాయం జరుగుతుందని ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ రవూఫ్, కాలనీ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత