మూడు దశాబ్దాల పోరాట యోధుడు లక్ష్మణ్ బాపూజీ
– వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర విముక్తి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవిరామ కృషి చేశారని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గాజీపూర్ మురళీకృష్ణ గౌడ్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ 106 వ జయంతి వేడుకలో మురళీకృష్ణ గౌడ్ పాల్పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కోసం మూడు దశల ఉద్యమాలలో పాల్గొని తెలంగాణ ప్రజానికి ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు. దశాబ్దాల తెలంగాణ కల సాకారమైన వేల ఆ స్వప్నాన్ని మాత్రం ఆయన చూడలేక పోవడం బాధాకరన్నారను. ఆయన కలలుగన్న బంగారు తెలంగాణ స్థాపనతోనే ఆయనకు ఘన నివాళులు అర్పించడమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, తెలంగాణ రాష్ర్ట బీసీ కమీషనర్ మెంబర్ శభప్రద్ పటేల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిగుళ్లపల్లి రమేష్ తదితరులు పాల్గోన్నారు.
