త‌ప‌స్ ఆధ్వ‌ర్యంలో వివేకానంద జ‌యంతి

తాండూరు వికారాబాద్

త‌ప‌స్ ఆధ్వ‌ర్యంలో వివేకానంద జ‌యంతి
– నివాళులు అర్పించిన ఉపాధ్యాయులు
యాలాల‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: స్వామి వివేకానంద 159వ జ‌యంతిని త‌ప‌స్‌(TPUS) ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రుపుకున్నారు. బుధ‌వారం యాలాల మండల కేంద్రంలో నిర్వ‌హించిన జ‌యంతి వేడుక‌ల‌లో త‌ప‌స్ ఉపాధ్యాయ నేత‌లు స్వామి వివేకానంద విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ భార‌తీయ సంస్కృతిని ప్ర‌పంచానికి చాటిన మ‌హ‌నీయుడు స్వామి వివేకానందుడ‌ని కొనియాడారు. స్వామి వివేకానందుడి మార్గం అంద‌రికి అనుస‌ర‌ణీయ‌మ‌న్నారు. ఆయ‌న అడుగు జాడ‌ల్లో అంద‌రు న‌డ‌వాల‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TPUS జిల్లా కార్యదర్శి సురేందర్‌, యాలాల్‌ మండల అధ్యక్ష,కార్యదర్శి నరహరి రెడ్డి,వీరేశం, ఉపాధ్యాయులు జనార్దన్‌ రెడ్డి మహేశ్‌,బస్వరాజ్‌,శేఖర్‌,నరేష్‌,బాలకృష్ణ,చంద్రశేఖర్‌ గ్రామ యువకులు పాల్గోన్నారు.