మా డిమాండ్లు నెరవేర్చండి.. మద్దతిస్తాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మా డిమాండ్లు నెరవేర్చండి.. మద్దతిస్తాం..!
– తాండూరు జై భీమ్ ఆర్గనైజేషన్ తీర్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మా డిమాండ్లను నెరవేర్చేందుకు ముందుకొచ్చే వారికి మా మద్దతిస్తామని తాండూరు జై భీమ్ ఆర్గనైజేషన్ సభ్యులు తెలిపారు. సోమవారం తాండూరు పట్టణంలోని శాంతినగర్ పార్కులో జై భీమ్ ఆర్గనైజేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు డిమాండ్లపై చర్చించారు. తాండూరులో ఐదు ఎకరాలలో బుద్ధవనం ఏర్పాటు, పట్టణంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి అందులో ఎలక్ట్రిషన్, ప్లంబర్, మోబైల్ రిపేరింగ్ వంటి విభాగాల్లో శిక్షణ ఇప్పించాలన్నారు.

దీంతో పాటు తాండూరులో ఎస్సీ స్మశాన వాటికకు స్థలం, అర్హులైన వారికి ఎస్సీ కార్పోరేషన్ ద్వారా రుణాలు ఇప్పించాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీలలో ఇళ్లులేని వారికి 70 గజాల స్థలం ఇవ్వడంతో పాటు కట్టుకునేందుకు రుణ సాయం అందించాలని కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్లను ఎవరైతే నెరవేరుస్తామని హామి ఇచ్చిన వారికి ఎన్నికల్లో పూర్తి మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఆర్గనైజేషన్ సభ్యులు శివకుమార్, జుంటుపల్లి వెంకట్, జై సాయి ప్రసాద్, జై నరేష్, శ్రీనివాస్, నర్సింలు, విజయేందర్, డివిటి ఎల్లప్ప, బాలరాజ్, రఘు, జగదీష్, శాంతు, కన్నా, జయరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత