బంజారుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్

తాండూరు రాజకీయం వికారాబాద్

బంజారుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్
– ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలి
– మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్త విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్త విఠల్ నాయక్ అన్నారు. గురువారం తాండూరు పట్టణం బాలాజీ నర్సింగ్ హోమ్ సమీపంలోని సంతు సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి విఠల్ నాయక్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సేవలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని అన్నారు.రాబోయే సేవాలాల్ జయంతి వరకు పూర్తిగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని తెలిపారు. అదేవిధంగా సేవలాల్ మహారాజ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు.

అదేవిధంగా ధూప దీప నైవేద్యాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే సేవలాల్ మహారాజ్ జయంతి వరకు సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భూకైలాస్ వ్యవస్థాపకులు వాసు పవర్ నాయక్, కౌన్సిలర్ భీమ్ సింగ్ రాథోడ్, కో ఆప్షన్ మెంబర్ వెంకట్రాం నాయక్, గిరిజన సోదరులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!