పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలి
– తాండూరు ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు
– సెక్టోరల్ అధికారులతో సమీక్షా సమావేశం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలలో అన్ని సదుపాయాలు కల్పించాలని తాండూరు ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు అన్నారు. మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో తాండూరు నియోజకవర్గ సెక్టోరల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు జాగ్రత్తలు వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. బీఎల్ ఓలు పోల్ చిట్టీలు ప్రతి ఓటరుకు అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ మహేష్ గౌడ్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

 మోసపోవద్దు గొసపడతాం..