కాంగ్రెస్ తోనే పేదలకు అండ

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ తోనే పేదలకు అండ
– ప్రచారంలో కాంగ్రెస్ నేతలు
– కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు అండ లభిస్తుందని ఆ పార్టీ తాండూరు నేతలు అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని సాయిపూర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి తరుపున ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొన్న బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు శ్యాం రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం పార్టీ నేతలు, మాజీ డీసీపీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప తదితరులు ప్రచారం కొనసాగించారు.

ఈ సందర్భంగా పేదలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించిందన్నారు. అధికారంలోకి వస్తే ఈ పథకాలతో పేదలకు సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

https://dharshininews.com/22003/