బీఆర్ఎస్‌కి జై..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్‌కి జై..!
– ఎమ్మెల్యే సమక్షంలో భారీగా చేరికలు
– కండువా కప్పి ఆహ్వానించిన రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల గ్రామస్తులు, పట్టణ వాసులు బీఆర్ఎస్‌ పార్టీకి జై కొట్టారు. శుక్రవారం రాత్రి తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో తాండూరు మండలం సిరిగిరిపేట గ్రామస్థులు దాదాపు 50 మంది, పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామస్థులు 50 మంది, తాండూరు పట్టణం 15వ వార్డుకు చెందిన మహిళలు, యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని.. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయన్నారు. తాండూరులో బంపర్ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీలో చేరిన కార్యకర్తలు బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమానికి జై కొట్టారు. తాండూరులో బంపర్ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, ఫ్లోర్ లీడర్ శోభారాణి, సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

మోగిన ఎలక్షన్ నగారా..!