కాంగ్రెస్ డేంజర్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ డేంజర్..!
– తాండూరులో దిగజారుడు రాజకీయాలు
– తాటాకు చప్పుళ్లకు అదిరేది లేదు, బెదిరేది లేదు
– కుట్రపూరితంగానే ఐటీ, ఈడీ దాడులు
– ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదు
– బీఆర్ఎస్ నేతలను బెదిరిస్తే ఊరుకోం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ డేంజరెస్ మారిందని, కావాలనే తనపై కుట్రలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.. బెదిగేది లేదు.. తగ్గేది లేదు.. అంటూ దుయ్యబట్టారు. వాళ్ళ ఫిర్యాదుతోనే ఐటీ దాడులు జరిగాయని ఆరోపించారు. రాజకీయ కుట్రంలో భాగంగా దాడులు జరిగాయని అన్నారు. తానేమి ఇల్లీగల్ పనులు ఏమి చేయలేదన్నారు. తాండూరు ప్రజలను మభ్యపెట్టేందుకు ఇలా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీలో దొంగలంతా ఏకమయ్యారని, తనను దెబ్బతీసేందుకు కక్ష్య పూరిత చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తాండూరు ప్రజల ఆశీర్వాదాలు తనపై ఎల్లప్పుడు ఉంటాయన్నారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాల్సిందే అని అన్నారు. అదేవి ధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నేతలు, రైతులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అంతేకాకుండా తాండూరులో కాంగ్రెస్ నేతల పర్యటనను అడ్డుకుంటున్నామని దుష్ప్రచారాలకు పాల్పడుతుందని, అలాంటివి మానుకోవాలన్నారు. తాండూరు అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధముని సవాల్ చేశారు.

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నమ్మిన, ప్రజలను మోసం చేసిందని. ఆ పరిస్థితి మనకు రావద్దంటే ఎన్నికల్లో ఓడించాలన్నారు. మరోసారి తాండూరు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలన్నారు. మరోవైపు బషీరాబాద్ మండలంలో మృతి చెందిన నేతల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

ఆ డబ్బులు నావి కావు.. స్నేహితునివి
మరోవైపు తాండూరులో ఐటీ అధికారులు దాడులు జరిగింది వాస్తమే అని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. అయితే తన ఇంట్లో దాడులు జరిగాయిని వచ్చిన పుకార్లను కొట్టి పారేశారు. తాండూరులోని శ్రీ దుర్గా గ్రాండూర్లో ఉంటున్న స్నేహితుని వద్ద జరిఫారని, అక్కడితో పాటు తనకు సంబంధం ఉన్న వ్యక్తుల వద్ద 14 చోట్ల విచారణ జరిపారని వివరించారు. తన స్నేహితుని వద్ద అతని వ్యాపారానికి సంబంధించిన సుమారు రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసిందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, నాయకులు సిద్రాల శ్రీనివాస్. కోహిర్ శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, అనంతయ్య ముదిరాజ్, రవి ందర్ రెడ్డి, వడ్డె రాములు, షేక్ హసన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!