ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖతం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖతం
– హస్తంకు హాత్ దేవ్.. కారుకు ఓట్ దేవ్..
– బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలి
– స్ట్రీట్ కార్నర్ మీటింగులలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– బీఆర్ఎస్‌లోకి పాత తాండూరు కాంగ్రెస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ ఖతం చేయాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం పాత తాండూరు, హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఇందిరమ్మ కాలనీ, పట్టణంలోని రహమత్ కాలనీలలో బీఆర్ఎస్ పార్టీ స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించారు. ఈ ప్రచారానికి హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రజలతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ పదేండ్లు వెనక్కి పోతామని, కర్ణాటక రాష్ట్రంలాగా మనం మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ కొట్లాటలు, పంచాయతీలు మొదలవుతాయన్నారు. అదేవిధంగా తాండూరు పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు.

పాత తాండూరులో ఇంటింటికి మిషన్ భగీరథ నీరు, బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పాత తాండూరు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఏ మున్సిపాలిటీకి లేని విధంగా రింగు రోడ్డు ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. తాండూరు బిడ్డగా ప్రజల కష్టాలు, సమస్యలు అన్ని తెలుసని అన్నారు. బయటోనికి ఈ సంగతులేవి తెలియవని అన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

పాత తాండూరు కాంగ్రెస్ ఖాళీ…
మరోవైపు పాత తాండూరులోని కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయినట్లు కనిపిస్తుందని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. పాత తాండూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీలు షేక్: ముజీబ్, సయ్యద్ ఫెరోజ్, ఇలియాస్, అంజద్, హుస్సేన్, సమీర్, ఆదిల్, సయ్యద్ పర్వేజ్ తో పాటు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీ, కౌన్సిలర్ వెంకన్న గౌడ్, ఆర్టీఏ మెంబర్ జావిద్, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!