బెడిసిన బేరం..!

క్రైం తెలంగాణ మహబూబ్ నగర్ వికారాబాద్

బెడిసిన బేరం..!
– అనిషాకు చిక్కిన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి
మ‌హ‌బూబ్ న‌గ‌ర్, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప్ర‌జా ప్ర‌తినిధి కుమారుడితో సీసీ రోడ్డు బిల్లు చెల్లింపుకు పంచాయితీ కార్య‌ద‌ర్శి కుదుర్చుకున్న భేరం బెడిసికొట్టింది. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధ‌క శాఖ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయింది. ఈ సంఘ‌ట‌న మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలంలో చోటు చేసుకుంది. మండ‌లంలోని చౌదర్ పల్లి పంచాయితీ సెక్రటరీ అనురాధ గ్రామ స‌ర్పంచ్ కుమారుడు ఆంజ‌నేయులుతో ఓ సీసీ రోడ్డు బిల్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్ర‌కారం గురువారం ఆంజ‌నేయులు నుంచి రూ. 25 వేల లంచం తీసుకుంటుండ‌గా అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు దాడులు చేసి ప‌ట్టుకున్నారు. ఈ మేర‌కు ఆమెపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు న‌మోదు చేశారు.