కులాంతర వివాహాలకు ప్రోత్సహాం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

కులాంతర వివాహాలకు ప్రోత్సహాం
– దంపతులకు రూ. 3లక్షల చెక్కు అందజేత
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కుల రహిత సమాజ స్థాపన కోసం కులాంతర వివాహాలకు ప్రోత్సహాం అందించడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు ప్రభుత్వం ప్రత్యేక నగదు అందిస్తుంది. తాండూరుకు చెందిన రమాదేవి, రంగారెడ్డి ప్రాంతానికి చెందిన శివకృష్ణలు కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక నగదు ప్రోత్సహానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా దంపతులకు రూ. 3లక్షలు మంజూరయ్యాయి. ఆదివారం తాండూరు ప్రజా భవన్ లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా దంపతులకు చెక్కును అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల రహిత సమాజ కోసం కులాంతర వివాహాలకు తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులు ఈ ప్రోత్సహాకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వీరానందం, నాయకులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం