బాపూ.. బాట స్పూర్తిదాయకం
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త
తాండూరు, దర్శిని ప్రతినిధి: మహాత్ముని మాట.. బాట.. స్పూర్తిదాయకం.. ఆదర్శనీయమని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త అన్నారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో.. గాంధీ చౌరస్తాలో ఉన్న గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అహింసా మార్గం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహాత్మ గాంధీ ప్రపంచానికే ఆదర్శం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు కల్వ రాజలింగం, కుంచెం మురళీధర్, కోట్రిక నాగరాజు, సిద్దణ్ణ, కోస్గి తిప్పయ్య, చిద్రి చంద్రయ్య, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, కోట్రిక శ్రీకాంత్, భాను ప్రసాద్, అలంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొనగా.. గాంధీ చౌక్ వద్ద టీర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
