గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే

తాండూరు రాజకీయం వికారాబాద్

గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే
– బీసీ సంఘం ఆధ్వర్యంలో జయంతి
– నివాళులు అర్పించిన సంఘం నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో సామాజిక రుగ్మతల రూపుమాపడంతో పాటు విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్తగా నిలిచారని తాండూరు బీసీ సంఘం నాయకులు అన్నారు.

శనివారం బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశంలో సామాజిక సంస్కరణలు, విద్యా అభివృద్ధి మరియు సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే ఒక గొప్ప సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందారని కొనియాడారు.

భారతదేశంలో మొదటి బాలికల పాఠశాల ప్రారంభం చేసి మహిళల విద్యకు పోరాటం చేశారని అన్నారు. అదేవిధంగా సత్యశోధక సమాజ్ స్థాపించి.. దళితుల హక్కుల కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. అణచివేతకు వ్యతిరేకంగా ప్రచారం* మరెన్నో ఉద్యమలు చేసిన మహానీయుడని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకుర్, మహిళా అధ్యక్షురాలు అనిత రాజ్, సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్, బీసీ యువ నాయకులు టైలర్ రమేష్, పరమేష్, గిరిజాపురం రమేష్, మోచి రాజు, అజిత్ ఠాకూర్, రాజు నాయి, విజయ్, రమేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

 

50 ట్రాక్టర్ల ఇసుక సీజ్..!