కమలమ్మకు నివాళులు..!
– పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– అంజలి ఘటించిన ప్రజా ప్రతినిధులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి తల్లి, మాజీ కౌన్సిలర్ జంటుపల్లి కమలమ్మకు పలువురు నివాళులు అర్పించారు. శనివారం ఆమె కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాత తాండూరుకు చేరుకున్నారు.

కమలమ్మ భౌతికళాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శా రాణిని పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్సీ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మాజీ డీపీసి సభ్యులు పద్దోళ్ల నర్సింలు, టీఆర్ఎస్ నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప తదితరులు ఉన్నారు.
మరోవైపు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మ మురళీకృష్ణగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, ఫ్లోర్ లీడర్ సోమ శేఖర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ తదితరులు కూడ కమలమ్మ భౌతిక కాయానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.

