న‌యా మండ‌లాల ప్ర‌గ‌తికి ప్రాధాన్య‌మివ్వండి

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

న‌యా మండ‌లాల ప్ర‌గ‌తికి ప్రాధాన్య‌మివ్వండి
– కొత్త జిల్లాల త‌ర‌హాలో భ‌వ‌నాలు, మౌళిక స‌దుపాయాలు క‌ల్పించండి
– ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి

వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: కొత్త జిల్లాల తరహాలోనే కొత్త మండలా ప్ర‌గ‌తిని ప్రాధాన్య‌మివ్వాల‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమ‌వారం శాసనమండలి వర్షాకాల సమావేశాల్లో భాగంగా జీరో అవ‌ర్‌లో ఎమ్మెల్సీ మహేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. కొత్త జిల్లాల కేంద్రాలో ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక సదుపాయాలను క‌ల్పించిన తరహాలోనే కొత్త‌గా ఏర్పాటు చేసిన అన్ని మండల కేంద్రాల్లోనూ కొత్తగా మండల పరిషత్, రెవెన్యూ తదితర కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా మౌళిక స‌దుపాయాల‌ను కూడ క‌ల్పించాల‌న్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 500 కోట్ల నిధులను జిల్లా మరియు మండల పరిషత్తుల నిర్మాణాల కోసం కేటాయించారని తెలిపారు. త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామ‌ని బ‌దులిచ్చారు.