అ’పూర్వ’ కలయిక..!

కెరీర్ తాండూరు రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్

అ’పూర్వ‘ కలయిక..!
– 25 ఏండ్ల జ్ఞాపకాల్లో విద్యార్థులు
– విద్యనేర్పిన గురువులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని అపురూపంగా జరుపుకున్నారు. పది కాదు.. ఇరవై కాదు.. 25 ఏండ్ల జ్ఞాపకాల్లో మైమరిచి పోయారు. ఒకప్పుడు తాండూరులో విద్యాభారతి పాఠశాల పట్టణంలోని ప్రసిద్ది. ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన పదో తరగతి విద్యార్థులు 25 ఏండ్ల సిల్వర్ జూబ్లీ వేడుకలను ఉత్సహాంగా జరుపుకున్నారు. ఆదివారం పట్టణంలోని గగ్రాణీ ఫంక్షన్‌లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి విజయవాడతో పాటు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఒకేసారి కలుసుకున్నారు.

తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులు గోపీచంద్, ప్రభులింగం, అంతారం లలిత, శ్రీనివాస్, ఉదయ్ కుమార్, హనుమంతు , నరసింహులుల సమక్షంలో మరోసారి ఆనాటి జ్ఞాపకాలను తలచుకుని తన్మయం చెందారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నత స్థానంలో గౌర వా న్ని పొందినప్పుడే ఉపాధ్యాయులకు పూర్తి గుర్తింపు లభిస్తుందని, విద్యార్థుల ఉన్నతిని తెలుపుతుంటే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ గురువులు చూపించిన సన్మార్గంలో నడిచి ప్రస్తుతం ప్రతి విద్యార్థీ వివిధ వృత్తుల్లో, ఉద్యోగాల్లో కొనసాగుతూ ఆనంద జీవితాన్ని గడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు రిపోర్టర్ కుమార్, బీఆర్‌ఎస్‌ తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్‌ గౌడ్, మధుకర్, రాజశేఖర్ రెడ్డి, భాగ్యశ్రీ, అలివేణి, మనీ, శ్రీదేవి, రాజ్ కుమార్, హనుమంత్ రెడ్డి, శ్రీనివాస్, భీమ్ రావ్ తదితరులు పాల్గొన్నారు.