సంఘటితంగా హక్కులను సాధించుకుందాం
– వీరశైవ లింగాయత్ బలిజ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప
– ఘనంగా సన్మానించిన తాండూరు సంఘం నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వీరశైవులు హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని వీరశైవ లింగాయత్ బలిజ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప అన్నారు. గురువారం తాండూరుకు వచ్చిన ఆయన స్థానిక సమాజం సభ్యులను కలిసి పట్టణంలోని భద్రేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వీరశైవ సమాజం వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమాజం సమాజం సంఘం అధ్యక్షులు పటేల్ ఉదయ్ కుమార్ శంకర్ గారి అధ్వర్యంలో వెన్న ఈశ్వరప్పను సమాజం సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వెన్న ఈశ్వరప్ప మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కుల సంఘం, కులవృత్తి ఉందన్నారు. వీరశైవ లింగాయత్‌లకు కులవృత్తి గాని ప్రత్యేకమైన కుల సంఘం గాని లేకపోవడంతో వెనుకబాటుకు గురయ్యామని అన్నారు.

వీరశైవులను ఓబీసీలో చేర్చాలని కొన్నేండ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా కేంద్రం వీరశైవులు ఓబీసీలో చేర్చే విధంగా సంఘటితంగా ఉద్యమించాలన్నారు. కేంద్రంలోని అధికార పార్టీకి అండగా ఉంటూ హక్కులను సాధించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సభ్‌యులు గాజుల శాంత కుమార్, పటేల్ విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు కోటం సిద్ధలింగం, గణపుర్ శంకర్, అన్నరం చెన్నబసప్ప, పి శివకుమార్, ప్రధాన కార్యదర్శి ప్రకాష్, గాజుల బసవరాజ్, మల్లికార్జున్, అడ్వకేట్ బాలి శివకుమార్, ఎడ్రామీ బసన్నప్ప తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

