ఇంట్లో పెండ్లి గొడవలు..!
– మిస్టరీగా కాబోయే పెళ్లికొడుకు మరణం
– అన్నా, వదినలపై అనుమానాలు
– తాండూరు మండలం సిరిగిరిపేట్లో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంట్లో పెండ్లి గొడవల నేపథ్యంలో కాబోయే పెండ్లి కొడుకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సిరిగిరిపేట్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం మేరకు… గ్రామానికి చెందిన వడ్డే పరమేష్ (24) అనే యువకుడు తల్లిదండ్రులు కోల్పోవడంతో అన్న వదినల దగ్గరనే ఉంటున్నాడు. రోజు కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత 15 రోజుల క్రితం వడ్డె పరమేష్‌కు అదే మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన యువతీతో నిశ్చితార్థం జరిగింది.
ఉగాది తర్వాత పెళ్లి కూడా చేయాలని నిర్ణయించారు. అయితే పరమేష్ పెండ్లి విషయంలో గొడవలు ప్రారంభమయ్యాయి. పెళ్లి చేయాలంటే డబ్బులు కావాలని ఆ డబ్బులు నువ్వే భరించాలని పరమేష్ తన అన్నావదినలతో తేల్చి చెప్పాడు. శనివారం రాత్రి కూడా ఇదేవిధంలో గొడవ జరిగింది. ఆదివారం ఉదయం పరమేష్ తన ఇంటి వరండాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. గమనించిన గ్రామస్తులు విషయాన్ని కరణ్ కోట్ పోలీసులకు సమాచారం అందించార. విషయం తెలుసుకున్న తాండూర్ రూరల్ సీఐ అశోక్ తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి పరమేష్ అన్న వదినలలపై అనుమానం వ్యక్తం కావడంతో వారిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం పరమేష్ మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.
లోకల్ యాడ్…

ఇదికూడా చదవండి…

