గరుకు స్తంభంకు గొప్ప విశిష్టత
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– గోశాలలో ఘనంగా గరుకు స్తంభం పూజ
తాండూరు, దర్శిని ప్రతినిధి : గోమాత కోసం ఏర్పాటు చేసే గరుకు స్తంభాలకు ఎంతో విశిష్టత ఉంటుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని గోశాలలో గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో గరుకు స్తంభ ప్రతిష్టాపన ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో గరుకుస్తంభంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ప్రతిష్టాపించిన గరుకు స్తంభానికి పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గోమాతను సకల దేవతలకు నిలయంగా కొలుస్తామన్నారు. గోవుల అనుగ్రహం కోసం ఏర్పాటు చేసే గరుకు స్తంభంలో ఎంతో విశిష్టత దాగుందన్నారు. గోవుల కోసం వీటిని ఏర్పాటు చేస్తే పితృదేవతలకు స్వర్గం అనుగ్రహంతో పాటు జన్మజన్మల పాపాలు తొలగిపోతాయన్నారు. అంతటి విశిష్టత ఉన్న గరుకు స్తంభాన్ని గోశాలలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్ పర్సన్ సునితా సంపత్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మురళీకృష్ణ గౌడ్, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, బోయరవి, రాము, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, గోశాల సేవా సమితి అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్, కోశాధికారి ఓం ప్రకాష్ సోమాని, నూతన అధ్యక్షులు సాయిపూర్ బాల్ రెడ్డి, యువనాయకులు రమేష్, బిడ్కర్ రఘు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

