ఏఎంసీ డైరెక్టర్‌గా నవాజ్..!
– భగవాన్ కరీం స్థానంలో నియామకం
– చైర్మన్ పట్లోళ్ల నర్సింలు సమక్షంలో పదవి బాధ్యతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్‌గా సయ్యద్ నవాజ్ నియామకం అయ్యారు.

గురువారం మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. గతంలో తాండూరు మార్కెట్ కమిటి డైరెక్టర్ గా కొనసాగిన మండలంలోని అంతారం గ్రామానికి చెందిన భగవాన్ కరీం అక్క అంత్యక్రియల కోసం వెళ్లి గుండెపోటుతో మరణించారు. దీంతో సుమారు ఏడాది పాటు ఆయన డైరెక్టర్ స్థానం ఖాళీ ఏర్పడింది.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో సయ్యద్ నవాజ్‌ను తాండూరు మార్కెట్ కమిటి డైరెక్టర్‌గా నియమించడం జరిగిందని చైర్మన్ పట్లోళ్ల నర్సింలు తెలిపారు. ఈ పదవిలో నవాజ్ పూర్తి రెండేళ్ల పాటు కొనసాగుతారని స్పష్టం చేశారు.

మార్కెట్ కమిటీ అభివృద్ధికి, స్థానిక రైతుల సమస్యల పరిష్కారానికి నూతన డైరెక్టర్ సంపూర్ణంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. మరోవైపు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా నవాజ్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. తన నియామకానికి సహకరించిన పెద్దలకు, చైర్మన్‌కు నవాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


