విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
– జినుగుర్తి గ్రామంలో ఘటన
– విచారణ చేపట్టిన పోలీసులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పొలంలో విద్యుత్ వైరును సరిచేస్తుండగా కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు.

ఈ సంఘటన గురువారం తాండూరు మండలం జినుగుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు కథనం మేరకు గ్రామానికి చెందిన తుంగల జగన్(50) గ్రామంలో చిన్న చిన్న మెకానిక్ పనులు చేస్తూ, కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అయితే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, ఏఎంసీ డైరెక్టర్ అజ్మత్ అలీ తన పొలంలో పైపులైన్ పనులు చేయించేందుకని ఆయన జగన్‌ను తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న విద్యుత్ వైర్‌ను జగన్ సరిచేసేందుకు వెళ్లాడు. ప్రమాద వశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో జగన్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆసుపత్రి మార్చురుకి తరలించారు. మృతుని కి భార్య అనసూజమ్మ, కుమారుడు మారుతి, కూతురు పూజలు ఉన్నారు. పూజకు వివాహము అయ్యింది. జగన్ మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఉత్తమ్ చంద్, గ్రామ సర్పంచ్ చరణ్, గ్రామ పెద్దలు కుటుంబ సభ్యులను పరామర్శించారు.


