వెలుగులు నింపుతున్న పైలెట్ ..!
– మసీదులు, మందిరాల వద్ద సెంట్రల్ లైటింగ్
– ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సాయిపూర్ ప్రజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నారు. దీంతో పాటు పట్టణంలోని పలు వార్డుల్లో సెంట్రల్ లైటింగ్ పోల్లు ఏర్పాటు చేసి హైమస్ట్ లైట్లతో వెలుగులు పంచుతున్నారు. ఇప్పటికే పట్టణంలోని పలు వార్డుల్లో సెంట్రల్ లైటింగ్ విధానం ద్వారా హైమస్టు లైట్లను ఏర్పాటు చేయించారు. తాజాగా పట్టణంలోని సాయిపూర్ మేయిన్ రోడ్డు వద్ద ఉన్న మజీద్ ఏ నూర్ వద్ద సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. గతంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని విద్యుత్ దీపాల సమస్యను పరిష్కరించాలని మత పెద్దలు కోరడంతో స్పందించి మజీదు వద్ద సెంట్రల్ లైటింగ్ స్థంభాన్ని ఏర్పాటు చేయించారు. స్థంబానికి లైట్లు బిగించే పనులు వేగంగా జరుగుతున్నాయి. వార్డుల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంపై స్థానిక సాయిపూర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతులు తెలుపుతున్నారు.
ఇదికూడా చదవండి…

