హస్తంలో సముదాయ మంత్రం
– పార్టీలో చేరే నేతలకు ఎమ్మెల్యే కొత్త కండిషన్
– వివాదాలకు చోటు లేకుండా దృష్టి
తాండూరు, దర్శిని ప్రతినిధి : గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో గడిబిడి వాతావరణం నెలకొంది. హస్తం పార్టీలో కొత్త నేతల చేరికల వల్ల ఈ పరిణాలు ఏర్పడ్డాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ఇందుకోసం సముదాయ మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొందరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సమాచారం లేకుండా చేరారని, ఇంకొందరు మనోహర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లే ఆయన సమక్షంలో పార్టీలో చేరడం పట్ల పార్టీ సీనీయర్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
దీంతో పాటు పార్టీ వ్యవహరాలపై బాధ్యతలు అప్పగించడంలో వివాదాలు తలెత్తుతున్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాత, కొత్త వర్గాలతో చర్చలు జరిపి సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో పాత, కొత్త వర్గాల నేతలు కలిసి పనిచేసేలా దృష్టి సారిస్తున్నారు. దీంతో పాటు పార్టీలో చేరాలనుకునే కొత్త నేతలకు కండిషన్ పెట్టాలని నిర్ణయించారు. పార్టీలో చేరాలని అనుకునే వారు స్థానిక నాయకులతో సంతృప్తికరమైన సంప్రదింపులు జరిపాకే పార్టీలో చేరాలని నిర్ణయాన్ని వెల్లడించారు. అందరు కలిసి మెలిసి నడిచేందుకు అందరి అభిప్రాయాలను తీసుకుంటామని తెలిపారు. దీంతో పార్టీ గాడిలో పడుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఇదికూడా చదవండి…

