చల్లని సేవ అభినందనీయం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– మార్వాడి యువమంచ్ చలివేంద్రాలు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి: మండు వేసవిలో మార్వాడి యువమంచ్ చల్లని సేవకు పూనుకోవడం అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తాండూరు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ ఎస్బీఐ – ఏడీబీ బ్యాంకు వద్ద, మున్సిఫ్ కోర్టు. పర్తాని కాంప్లెక్స్, మల్లప్ప మడిగ వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. పర్తాని కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్వాడి యువమంచ్ సామాజిక సేవలకు ముందుంటుందని అన్నారు. ఈ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చల్లని చలి వేంద్రాలను ఏర్పాటు చేసి సేవా దృక్పథాన్ని కొనసాగించడం అభిందనీయమన్నారు. మినరల్ వాటర్ అందిస్తున్న ఈ చలివేంద్రాలను బాటసారులు సద్వనియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయని ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మరోవైపు మున్సిఫ్ కోర్టు వద్ద చలివేంద్రాన్ని బార్ అసోసియేషన్ అధ్యక్షులు అగ్గనూర్ శ్రీనివాస్, ఎస్బీఐ బ్యాంకు వద్ద చలివేంద్రాన్ని రాజస్థాని ప్రగతి సమాజం అధ్యక్షులు రమేష్ చంద్రబూబ్, మల్లప్ప మడిగ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాజస్థాని సవయువ సంఘం అధ్యక్షులు మన్మోహన్ సార్డా, కుంజ్ బిహారి సోని, సన్ని అగ్రవాల్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల సర్సింలు, సాయిపూర్ బాల్ రెడ్డి. కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మార్వాడి యువమంచ్ నూతన అధ్యక్షులు అనిల్ సార్ధా, కార్యదర్శి సచిన్ రాఠీ. కోశాధికారి అరుణ్ సార్డా, సునీల్ సార్డా, ముఖేష్ సోమాని, కరణ్ జైన్, నిఖిల్ అగ్రవాల్, మధు, సమాజం పెద్దలు ద్వారక ప్రసాద్ సార్డా, మురళీధర్ గగ్రాని, రాంనారాయణ బూబ్, భగవాన్ దాస్ గగ్రాని, అశోక్ సార్డా, వినోద్ బూబ్, గోపాల్ సోని తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

