కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహుర్తం

తాండూరు రాజకీయం వికారాబాద్

కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహుర్తం
– రేపు యాలాల, బషీరాబాద్ మండలాల్లో అందజేత
– హాజరు కానున్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం లబ్దిదారులకు మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహుర్తం ఖరారయ్యింది.

రేపు తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం, బషీరాబాద్ మండలాల్లో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై లబ్దిదారులకు మంజూరైన కొత్త రేషన్ కార్డులను అందజేయనున్నారు.

మంగళవారం బషీరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉదయం 11 గంటలకు, యాలాల మండల కేంద్రంలోని మధ్యాహ్నం 2 గంటలకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. రేపు బషీరాబాద్, యాలాల మండల కేంద్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, లబ్దిదారులు హాజరై వి జయవంతం చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

వ్యక్తి అనుమానాస్పద మృతి..!