చేవేళ్లకు కొండే అండ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చేవేళ్లకు కొండే అండ..!
– అభివృద్ధిపై విశ్వేశ్వర్ రెడ్డికి విజన్
– దేశానికి మూడో సారి పీఎం మోడి ఖాయం
– కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి కొండా సంగీతారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల ప్రజలకు ఏ కష్టమొచ్చినా కొండం అండగా నిలిచేందుకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిద్దంగా ఉన్నారని ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం తాండూరు పట్టణంలో భర్త కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుకోసం సంగీతారెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని గణపతి ఆలయంలో పూజలు నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ప్రచారం కొనసాగించారు. ఓటర్లను స్వయంగా పలకరించి బీజేపీని, కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తుందన్నారు. ప్రధాని మోడి దేశ ప్రజల కోసం కష్టపడుతున్నారని అన్నారు. దేశంలో మూడోసారి మోడి ప్రధాని కావడం ఖాయమన్నారు. ఆదేవిధంగా చేవేళ్ల పార్లమెంట్ పరిధి అభివృద్ధి కోసం కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజన్ తో ముందుకు సాగుతున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే పక్కా ప్రణాళికలతో చేవేళ్లను అభివృద్ధి చేస్తారని అన్నారు. చేవేళ్ల ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తారని అన్నారు. ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు తాండూరులోని హిమాలయ హోటల్లో స్థానిక వైద్యులతో కొండా సంగీతారెడ్డి సమావేశం అయ్యారు. తన భర్త గెలుపుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, మాజీ ప్రధాన కార్యదర్శి యు.రమేస్ కుమార్, తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, మహిళ మోర్చ నాయకురాలు అంతారం లలిత, నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

సమాజం మెచ్చే సేవలు..!

సమాజం మెచ్చే సేవలు..!