నన్ను నమ్మండి..!
– తాండూరు రూపురేఖలు మారుస్తా
– ఎన్నికల్లో ఎంపీ రంజిత్ రెడ్డిని గెలిపించండి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ఘన సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : నమ్మి గెలిపించిన తాండూరు ప్రజల కోసం నమ్మకంగా పనిచేసి అభివృద్ధి చేసి చూపిస్తానని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు వీరశైవ సమాజం ఆధ్వర్యంలో పట్టణంలోని వీరశైవ సమాజం ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తన గెలుపులో భాగమైన వీరశైవులందరికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఎన్నికల తరువాత తాండూరు ప్రజలకు ఇచ్చిన హామిలను నెరవేరుస్తున్నామన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లను నమ్మొద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ తాండూరు నియోజకవర్గ చుట్టూ మనకు కావాల్సిన నేతలు ఉన్నారని అన్నారు. వారందరి సహాకారంతో తాండూరును అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి గెలుపుకు సహకరించాలని విజ్ఞఫ్తి చేశారు. నన్ను నమ్మండి.. ఎన్నికల తరువాత ఇద్దరం కలిసి సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ల సహాకారంతో తాండూరు రూపు రేఖలు మారుస్తామని అన్నారు.
అదేవిధంగా వీరశైవుల విజ్ఞప్తులను ఎన్నికల తరువాత అమలు చేస్తామన్నారు. అనంతరం వీరశైవ సమాజం సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, సమాజం అధ్యక్ష, కార్యదర్శులు, పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

