బీజేపీకి జై కొట్టిన తాండూరు వీరశైవులు
– కొండా సమక్షంలో పార్టీలో చేరికలు
– సాదరంగా ఆహ్వానించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: అటు రాష్ట్రంలో ఇటు జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతం అవుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు అంతా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా తాండూరులోని వీరశైవ సమాజం సభ్యులు కూడా బీజేపీ పార్టీకి జై కొట్టారు. బుధవారం సమాజం అధ్యక్షులు ఆర్.బస్వరాజ్ ఆధ్వర్యంలో సుమారు 200ల మంది బీజేపీ పార్టీలో చేరారు.
కార్యక్రమానికి హాజరైన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో పలువురు కషాయం కండువాలు కప్పుకున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమాజం సభ్యులు సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వీరశైవం స్థాపకుడు బసవేశ్వరుడు సమాజంలోని అంతరాలను ప్రశ్నించిన మహనీయుడని కొనియాడారు. ఆయన చూపిన మార్గం, ఆదర్శాలు, నడవడిక మేటి నాయకులకు మార్గదర్శకమని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఆయన ఆదర్శంగా తీసుకొని సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కరు సేవా మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు భారతీయ జనతా పార్టీ నిత్యం పాటుపడుతుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో వీరశైవులు బీజేపీ గెలుపుకు తోడ్పాటు అందించాలన్నారు. ఎన్నికల తరువాత వీరశైవులకు అండగా ఉంటానని హామి ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్లు సాహు శ్రీలత, బంటారం లావణ్య, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పట్టణ అధ్యక్షులు మల్లేశం, పటేల్ విజయ్ కుమార్, సమాజం ఉపాధ్యక్షులు సడ్గి భద్రణ్ణ, రాష్ట్ర వీరశైవ లింగాయత్ బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయ్ శంకర్, జిల్లా గౌరవాధ్యక్షులు మోళిగి వీరేశం, వీరశైవ జంగమ సమాజ అధ్యక్షులు గూళీ శివకుమార్, పెద్దలు వాలి శాంతుకుమార్, ప్రభు శంకర్, గౌరీశంకర్, బాలి రాజశేఖర్, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

