కాంగ్రెస్ పార్టీలో చేరిన జుబేర్ లాల
– రంజిత్ రెడ్డి, మనోహర్ రెడ్డిల సమక్షంలో చేరిక
– స్వాగతించిన పార్టీ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ సయ్యద్ జుబేర్ లాల కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం తాండూరుకు వచ్చిన చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ నేతలు జుబేర్ లాలకు హస్తం కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి, మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని అన్నారు. పార్టీలో నేతలు అంతా గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరణం పురుషోత్తంరావు, డాక్టర్ సంపత్ కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి. అబ్దుల్ రవూఫ్, ప్రభాకర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ పరిమళ, పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

