పోలింగ్ విధులకు అధికారుల డుమ్మా

తాండూరు రాజకీయం వికారాబాద్

పోలింగ్ విధులకు అధికారుల డుమ్మా
– 40 మందిపై జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు
– సర్దుబాటు చర్యలు తీసుకున్న అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల విధులకు అధికారులు డుమ్మా కొట్టారు. ఈసంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాండూరుకు నియోజకవర్గానికి పీఓలు, ఏపీఓలు, ఓపీఓలతో పాటు దాదాపు 1400 మంది అధికారులను నియమించారు. గత కొన్ని రోజులుగా వారికి శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు.

రేపు జరిగే ఎన్నికల సందర్భంగా తాండూరు ఆర్డీఓ, ఎన్నికల సహాయ. అధికారి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో పట్టణంలోని సెయింట్ మార్క్స్ హై స్కూల్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను కూడా నిర్వహించారు. ఈ ప్రక్రియకు అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు. కాని సుమారు 40 మంది అధికారులు ఎన్నికల విధులకు డుమ్మా కొట్టినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో విధులకు హాజరుకాని అధికారులపై సీరీయస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏకంగా సస్సెండ్‌ కూడా చేసే అవకాశం ఉంటుందని ఆర్డీఓ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. మరోవైపు విధులకు గైర్హాజరు అవుతున్న అధికారులు స్థానంలో రిజర్వుగా ఉన్న ఏపీఓ, ఓపీఓలను నియమించేందుకు జిల్లా అసిస్టెంట్. కలెక్టర్ ఉమా హారతి చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. ఇదిలా ఉండగా ఎన్నికల విధులకు గైర్హాజరైన అధికారుల సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇదికూడా చదవండి…

ఓటింగ్‌కు రెడీ..!