ఎముక‌లు పుష్టిగా ఉండాలంటే..!

ఆరోగ్యం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

ఎముక‌లు పుష్టిగా ఉండాలంటే..!
– ఆహార నియ‌మాల‌తో ఫ‌లితాలు
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: మాన‌వ‌ శరీరం మొత్తం ఎముకల నిర్మాణంపై ఆధారపడి ఉంటుందని మనకు తెలిసిందే. అందుకే వాటిని బలంగా ఉంచడం ఎంతో ముఖ్యం. ఎముకలు శరీర ఆకారానికే కాకుండా ఎన్నో ముఖ్యమైన అవయవాలను కాపాడుతుంటాయి. ఆరోగ్యకరమైన జీవితానికి శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవ‌స‌రం. దీని కోసం కండరాలు, ఎముకలు కూడా ఎంతో బలంగా ఉండడం ముఖ్య‌మైన ప‌ని. వ‌రుస ప‌నులు, బీజీ జీవితంలో ఎముకలు క్షీణించడం, పెళుసుగా ఉండటం వల్ల ఎముక క్యాన్సర్, రికెట్స్ వంటి వ్యాధులు వస్తాయని చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకే ఎముకలు దృఢంగా ఉండాలంటే ఎలాంటి పదార్ధాలు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలు.. ఎంతో మేలు : కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పాలను సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. రోజూ పాలు తీసుకుంటే మీకు కాల్షియం మూడింట ఒక వంతు లభిస్తుంది. పాలు తాగడానికి ఇష్టపడకపోతే అల్పాహారంలో ఓట్స్‌తో పాటు పాలు కలిపి తీసుకోవచ్చు.

గుడ్డూ.. వేరీగుడ్ : శరీరంలో తక్కువ స్థాయి ప్రోటీన్ ఎముకల పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల మీ ఆహారంలో గుడ్లను చేర్చడం వల్ల ఆరోగ్యకరమైన ప్రొటీన్లు అందించి ఎముకలు దృఢంగా మారేందుకు దోహ‌ద‌పడుతుంది. ఉడకబెట్టిన గుడ్లను తినలేకపోతే, వేయించడం లేదా ఆమ్లెట్‌లాగా వేసుకుని కూడా తినవచ్చు.ప్రోటీన్ తగినంత పరిమాణంలో తీసుకోవ‌డం శ‌రీరానికి ఎంతో ఉపయోగ‌క‌రంగా ఉంటుంది.

డ్రై ఫ్రూట్స్‌తో ఉప‌యోగం : ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి వాల్‌నట్స్, జీడిపప్పు, బాదం తీసుకోవాలి. వీటిని ప్రతిరోజూ కొన్ని చొప్పును తీసుకుంటే ఎముకల బలంగా తయారవడంలో ఎంతో సహాయపడతాయి. ఎముకల ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్‌ ఎంతో ఉపయోగపడతాయి.

అంజీర‌, నారింజ‌తో శ‌క్తి : తరచుగా అంజీర పండ్లు డ్రై అంజీర అయినా సరే తింటే బాడీలో కాల్షియం పెరుగుతుంది. ఓ కప్పు అంజీరలో 242ml ఉంటుంది. తరచూ అంజీర తింటే ఎముకలు గట్టిగా అవుతాయి. నారింజల్లో కాల్షియం ఎక్కువ. ఒక నారింజ పండులో 60 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే వాటిలోని విటమిన్ D, సిట్రస్ శరీర వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి