చిరు వ్యాపారులకు దుకాణాలు..!
– ఆర్టీసీ డీపో మేనేజర్‌తో బీఎస్‌ఆర్ చర్చలు
– కూల్చివేతలపై వ్యాపారులకు అండగా నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బస్టాండ్ సమీపంలోని చిరు వ్యాపారులకు సొంత దుకాణాలు నిర్మించేందుకు చొరవ చూపాలని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కోరారు.

శనివారం తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్ సురేష్ కుమార్‌తో చర్చలు జరిపారు. రెండు రోజులుగా తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డబ్బాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్న సంగతి తెలిసిందే. మున్సిపల్ అధికారులు జేసీబీతో కూల్చివేతలు చేయడంతో వ్యాపారులు రోడ్డున పడ్డారు.

ఈ విషయం బుయ్యని శ్రీనివాస్ రెడ్డి దృష్టికి వెళ్లింది. దీంతో శ్రీనివాస్ రెడ్డి ఆర్టీసీ డీపో మేనేజర్‌తో చర్చలు జరిపారు. డబ్బాలను కొల్పోయిన వ్యాపారులకు ఆర్టీసీ ప్రాంగణంలో దుకాణాలు నిర్మించేందుకు చొరవ చూపించాలని కోరారు. అట్టి దుకాణాలను వ్యాపారులకు కేటాయించే అవకాశాలపై చర్చించారు.

అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ డబ్బాలను కోల్పోయిన వ్యాపారులకు అండగా ఉంటామని భరోసా అందించారు. దుకాణాలు నిర్మించి.. కేటాయించేలా కృషి చేస్తానని తెలిపారు. ఆయన వెంట తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, పర్యాద రామకృష్ణ, ఎబీనేజర్, వ్యాపారులు తదితరులు ఉన్నారు.


