తిష్టవేసిన సమస్యలకు చికిత్స
– జిల్లా ఆసుపత్రిలో కొత్త డ్రైనేజీ వ్యవస్థ
– తాగునీటి ఇబ్బందులకు పరిష్కారం
– ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న మున్సిపల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో తిష్ఠవేసిన సమస్యలకు చికిత్స చేస్తున్నారు. శుక్రవారం జిల్లా ఆసుపత్రిని జిల్లా కొత్త కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించిన 24 గంటల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాండూరు. మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా ఆసుపత్రిని సందర్శించినప్పుడు ఆసుపత్రిలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదని దృష్టికి వెళ్లింది. దీనితో పాటు ఆసుపత్రిలో తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినట్లు కనిపించింది. వెంటనే జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అక్కడే ఉన్న మున్సిపల్ అధికారులకు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో శనివారం మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, డీఈ ఖాజా హుస్సేన్ లు జిల్లా ఆసుపత్రిని సందర్శించారు.
ముఖ్యంగా ఆసుపత్రిలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించే ందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలించారు. దీంతో పాటు తాగునీటి విషయంపై కూడా దృష్టి సారించారు. జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న డ్రైనేజీ వ్యవస్థను కొత్త మార్గంలో నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు రూ. 5లక్షలతో ప్రతిపాదనలు చేశారు. మరోవైపు తాగునీటి కోసం పాత మున్సిపల్ కార్యాలయం నుంచి జిల్లా ఆసుపత్రికి తాగునీరు సరఫరా చేయాలని నిర్ణయించారు.

ఇదికూడా చదవండి…

