5శాతం రాయితీకి నెలాఖ‌రే గ‌డువు

తాండూరు వికారాబాద్

5శాతం రాయితీకి నెలాఖ‌రే గ‌డువు
– ముంద‌స్తు ఆస్తిపన్నుల చెల్లింపుకు అవ‌కాశం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: రాష్ట్ర ప్ర‌భుత్వం మున్సిపాల్టీలో ముంద‌స్తు ఆస్తిప‌న్నుల చెల్లించిన వారికి రాయితీ క‌ల్పించే ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టింది. తాండూరు, వికార‌బాద్ మున్సిప‌ల్‌లో కూడ ఈ ప‌థ‌కం అమ‌ల్లో ఉంది. ఈ నెలాఖ‌రులోగా ప్ర‌జ‌లు వారి ఆస్తి ప‌న్నుల‌ను మొత్తం చెల్లిస్తే అందులో 5 శాతం రాయితీ ఇస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను ఆస్తిప‌న్నుల‌ను మొత్తం చెల్లిస్తే ఈ స‌దుపాయం వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. బ‌కాయిలు లేనివారే అర్హుల‌ని తెలిపారు. రాయితీని పొందాల‌నుకునే ల‌బ్దిదారులకు ఈనెల 30 వ తేది వ‌ర‌కు గ‌డువు ఉంటుంది, ఈలోగా ప‌న్నులు చెల్లిస్తే 5 శాతం రాయ‌తీ వ‌ర్తిస్తుంద‌న్నారు. ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని ఆస్తి ప‌న్నుల‌ను చెల్లించాల‌ని తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్ సూచించారు. పూర్తి వివ‌రాల‌కు తాండూరు మున్సిప‌ల్ కార్యాల‌యంలో సంప్ర‌దించాల‌న్నారు.